Thursday, January 16, 2025

మనిషిని బతికించుకుందాం!

- Advertisement -
- Advertisement -

మనిషి కనుమరుగయ్యే అవకాశాలు చాలా వున్నాయని ఎంతో మంది శాస్త్రవేత్తలు తమ ప్రయోగ ఫలితాల వల్ల, పరిశీలనల వల్ల తెలియజేశారు. విషయాన్ని బలపరుస్తూ ఎంతో మంది సరళ వైజ్ఞానిక రచయితలు, మేధావులు పుస్తకాలు రాశారు. సినిమా దర్శక నిర్మాతలు వీడియోలు, చలన చిత్రాలు రూపొందించారు. ఈ భూమి అనారోగ్యకర ఆవాసంగా తయారు కావడానికి ఎన్నె న్నో కారణాలు కనబడుతున్నాయి. అణు యుద్ధం, జీవ సంబంధమైన యుద్ధం కోలుకోలేని రోగాలు, మందుల ప్రతికూల ప్రభావాలు, నియంత్రణలేని జనాభా కుప్పగూలిపోతున్న పర్యావరణం, కృత్రిమ మేధ, వెర్రి తలలు వేస్తున్న జీవ సాంకేతిక పరిజ్ఞానం, రొబోట్లు, పునరుత్పత్తి పొందగలిగే నానో రొబోట్లు, ఇవిగాక ప్రకృతి సంబంధమైన వరద బీభత్సాలు, అగ్ని పర్వతాలు, కరువు, ఆహార ధాన్యాల కొరత ముఖ్యంగా శుభ్రమైన గాలి, నీరు దొరకకపోవడం.

Aviation sector recovering

మనిషి భౌతికంగా సజీవుడై ఉంటేనే విలువలు ప్రతిష్టించగలిగేది. ప్రేమాభిమానాలు, ఆత్మీయతలు పంచుకోగలిగేది. మనిషి ప్రకృతిని పరిరక్షించుకో గలిగితేనే మనిషి తనలోని చెడుపై తిరుగుబాటు చేయగలిగేది. సమాజంలోని చెడుపై ధ్వజమెత్తగలిగేది. మానవత్వం నా మొదటి ప్రపంచం, మానవ వాదం నా రెండో ప్రపంచం. అయితే నేను ఒక మామూలు మానవ మాత్రుడిగా నా ‘మూడో ప్రపంచం’లో బతుకుతుంటాను. అయితే ఇది నిరంతరం కొనసాగించే యుద్ధం. ఇప్పుడు నిజంగానే మనిషిని బతికించుకోవాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైంది. ఒకవైపు పొంచి ఉన్న అణుయుద్ధం, మరోవైపు కాలుష్యం, ఇంకోవైపు మానవ నీచ ప్రవృత్తి. ఇవి మూడు మూడు వైపుల నుండి దండెత్తి మనిషిని ఒక మూలకు నొక్కి పెడుతున్నాయి. మనసుని ముక్కలు చేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే జురాసిక్ యుగంలో రాజ్యమేలి, నశింపు పొందిన డైనోసార్స్ లాగా ఈ శతాబ్దపు అంతానికి మనిషి నశించిపోయే ప్రమాదం లేకపోలేదు.
విలువల వలువలు కనబడక పోవడమన్నది ఇప్పుడు మాత్రమే జరుగుతున్న విషయం కాదు. అది భారత కాలం నుండి వుంది. అంతకు ముందు నుండి కూడా వుంది. భారతంలో పాంచాలి వలువల్ని విప్పే ప్రయత్నం దుశ్శాసనుడు చేయనే చేశాడు. అందుకు శిక్ష కూడా అనుభవించాడు. అందువల్ల ఈ పోరాటం లోగడ జరిగింది. ఇప్పుడు జరుగుతోంది. ఇక ముందు జరుగుతూనే వుంటుంది. ఈ యుద్ధానికి అంతం లేదు. కష్ట సాధ్యమైనా చెడుపై మంచికి గెలుపు ఖాయం! అనే భావంతోనే ఆశాజీవి అయిన మనిషి జీవిస్తూ వున్నాడు. బాధ్యత గల కవులు, రచయితలు, శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, అధికారులు… సమాజంలోని అన్ని రంగాల వారు పూనుకొని వారి వారి కోణంలోంచి మనిషి మనుగడకు దోహదం చేయాల్సి వుంది. దృక్పథాలు వేరైనందువల్ల ఏర్పడే పలుచని పొరలేవైనా వుంటే, వాటిని విస్మరించి, ఈ విషయంలో అందరూ ఏకం కావాల్సిన అవసరం వుంది. పుణ్యం గురించి, పవిత్రత గురించి ఇప్పుడు మనం అన్వేషించనక్కర లేదు. అవి మరణానంతరం దొరికేవి. కాని, మనం బతికి వుండగానే జీవితంలో వెతుక్కోవాల్సింది మానవత్వం. ఒకరికి ఇవ్వడం, మనస్ఫూర్తిగా నవ్వడం ఎక్కడెక్కడో తప్పిపోయినా, మళ్లీ దొరకడం, ఆడడం, పాడడం, ప్రేమించడం, ప్రేమ పొందడం.. అన్నీ.. అన్నీ ఒక క్రమపద్ధతిలో మనిషి లాగానే నిర్వహిస్తూ వుండాలి.
మనిషి కనుమరుగయ్యే అవకాశాలు చాలా వున్నాయని ఎంతో మంది శాస్త్రవేత్తలు తమ ప్రయోగ ఫలితాల వల్ల, పరిశీలనల వల్ల తెలియజేశారు. విషయాన్ని బలపరుస్తూ ఎంతో మంది సరళ వైజ్ఞానిక రచయితలు, మేధావులు పుస్తకాలు రాశారు. సినిమా దర్శక నిర్మాతలు వీడియోలు, చలన చిత్రాలు రూపొందించారు. ఈ భూమి అనారోగ్యకర ఆవాసంగా తయారు కావడానికి ఎన్నెన్నో కారణాలు కనబడుతున్నాయి. అణు యుద్ధం, జీవ సంబంధమైన యుద్ధం కోలుకోలేని రోగాలు, మందుల ప్రతికూల ప్రభావాలు, నియంత్రణలేని జనాభా కుప్పగూలిపోతున్న పర్యావరణం, కృత్రిమ మేధ, వెర్రి తలలు వేస్తున్న జీవ సాంకేతిక పరిజ్ఞానం, రొబోట్లు, పునరుత్పత్తి పొందగలిగే నానో రొబోట్లు, ఇవిగాక ప్రకృతి సంబంధమైన వరద బీభత్సాలు, అగ్ని పర్వతాలు, కరువు, ఆహార ధాన్యాల కొరత ముఖ్యంగా శుభ్రమైన గాలి, నీరు దొరకకపోవడం. ఇవన్నీ ఇలా వుంటే విశ్వాంతరాళంలో గ్రహాల కదలికతో వచ్చే మార్పుల వల్ల పూర్తిగా మారిపోయే పర్యావరణం వల్ల ఈ భూమి ఇంకా, ఇంత జనాభాను భరించలేక పోవచ్చుననే అభిప్రాయం కూడా ఒకటుంది!
తత్వవేత్త రాబర్ట్ ఆడమ్స్ ప్రకారం మనం మన పర్యావరణాన్ని, భూమిని, నదుల్ని, సముద్రాల్ని సురక్షితంగా వుంచుకుంటున్నామా అనే దాని మీద మన మనుగడ ఆధారపడి వుంటుంది. మన పిల్లలకు మనమేం చేస్తున్నాం, మళ్లీ మన పిల్లలు వారి పిల్లల కేం చేస్తున్నారు అనేది ముఖ్యం. అలా తరాల తర్వాత తరాలు బుద్ధిని ఉపయోగించి, తెలివిగా మసలుకోగలిగితే మానవ జాతికి అంతమంటూ వుండేనే వుండదు.
మరో తత్వవేత్త నిక్ బోస్ట్రోమ్ చెప్పేదేమంటే “ ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ తరం వారైనా సమాజంలో అన్ని విధాలా ‘చెడు స్థాయి’ని పెంచకుండా వుంచగలిగితే చాలు. అంతకన్నా మరేం లేదు. దీని మీద ఇంత చర్చ అనవసరం” అని అన్నాడు. దేశాల మధ్య, ప్రభుత్వాల మధ్య సయోధ్య లేక ప్రమాదకరమైన సూక్ష్మ క్రిముల్ని ఒక పథకం ప్రకారం ఇతర దేశాల మీద ప్రయోగిస్తే.. అది అక్కడితో ఆగదు. మొత్తానికి మొత్తంగా ప్రపంచ జనాభాయే నాశనమై పోతుంది అని అంటున్నారు వైద్య శాస్త్ర నిపుణులు. ఎందుకంటే రాబోయే కాలంలో కొత్త వైరస్‌లు, కొత్త బాక్టీరియాలు పుట్టుకొచ్చే ప్రమాదం తప్పకుండా వుంది. వాటిపై మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న ‘యాంటీ బయాటిక్స్’ పని చేయవు. కొత్త వేవో కనుక్కొని వాటికి విరుగుడు మందులు తయారు చేసుకునే లోపు, ఎంతో ప్రాణ నష్టం జరిగే ప్రమాదం వుంది.
హైడ్రోజన్ తగ్గడం మూలాన మరో బిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడి వేడి, వెలుతురు ఊహించలేనంత పెరుగుతుంది. అప్పుడు భూమిపై పొరలన్నీ వేడెక్కుతాయి. ఫలితంగా సముద్రాలు ఇంకిపోవచ్చు. ఇది జరగక ముందే కార్బన్ డై ఆక్సైడ్ తగ్గిపోతుంది. అంటే వృక్షజాతి నశించిపోతుంది. దాని ఫలితం అన్ని జీవరాసులపై వుంటుంది. అంటే మనిషి మీద కూడా వుంటుంది కదా? ఇలాంటి మార్పుల వల్ల సూర్యుని వేడి పెరుగుతూ పోయి, చివరికి భూమి నాశనమవుతుంది అని కొన్ని వైజ్ఞానిక కథనాలున్నాయి. హాన్స్ రోస్‌లింగ్, స్వీడిష్ మెడికల్ డాక్టర్, ప్రొఫెసర్ పరిశోధనలు చేసి చెప్పిందేమంటే ‘21వ శతాబ్దంలో ప్రపంచ జనాభా పెరుగుతుంది’ అని ! అది ప్రస్తుతం నిజమవుతోంది కదా? అంటే రాబోయే శతాబ్దాల గురించి వైజ్ఞానికులు చెప్పేవి కూడా నిజం కావొచ్చు.. సర్ మార్టిన్ రీస్ “మన తుది గంట” (OUR FINAL HOUR) పుస్తకంలో చెప్పినట్టు విపరీతంగా పెరిగిపోతున్న వైజ్ఞానిక ప్రగతే మానవ వినాశానికి కారణమవుతోంది.
నానో టెక్నాలజీ వల్ల భూ పర్యావరణానికి ముప్పు బాగా వాటిల్లుతుంది. హై ఎనర్జీ ఫిజిక్స్ రీసర్చ్ వల్ల భూమి మీద మైక్రో బ్లాక్ హోల్స్ పడే అవకాశముంది. అంతేకాదు, ఎన్‌ఇఒల (NEOS) వల్ల అంటే, నియర్ ఎర్త్ ఆబ్‌జెక్ట్ (NEAR EARTH OBJECTS) వల్ల భూమికి అతి సమీపంలో ఉన్న పదార్థాల వల్ల , వాటి ప్రభావాల వల్ల జీవరాశులు పెద్ద ఎత్తున నాశనం కావొచ్చు. గ్రావిటీ ట్రాక్టర్ (GRAVITY TRACTOR) మనిషి తయారు చేసిన పరికరమే! వైజ్ఞానిక ప్రయోగాల్లో ఎన్నో యంత్రాల్ని అంతరిక్షంలోకి పంపుతున్నాం. వాటి వల్ల కూడా పెను ప్రమాదాలు సంభవించొచ్చని సర్ మార్టిన్ రీస్ హెచ్చరించారు. సహజంగా మనుషులు పుట్టి పెరగడం కాకుండా, ఇప్పుడు జెనటిక్ ఇంజినీరింగ్‌తో సహజత్వం, సాంకేతికతల సంయుక్త ‘ఉత్పత్తులు’ అంటే కొత్త జీవాలు పుడుతున్నాయి. మనుషులు కూడా పుడుతున్నారు. దీని వల్ల ముందు ముందు నైతికత సమస్యలు ఉత్పన్నం కావొచ్చు రాగల కాలంలో ఈ ప్రయోగాలు ఎలాంటి విపత్కర పరిణామాలకు దారి తీస్తాయో చెప్పలేం కదా అని కొందరు భయపడుతున్నది కూడా నిజమే!
ఒక వైపు మనిషే నశించిపోయే పరిస్థితులు దగ్గర పడుతూ వుంటే… భాషా ఉద్యమాలకు, ప్రాంతీయ సామాజిక ఉద్యమాలకు, రిజర్వేషన్లకు, అస్తిత్వ పోరాటాలకు, జలాల వివాదాలకు విలువేముంటుంది? ఆలోచించవల్సిన విషయం. మనిషి సజీవంగా కళకళ లాడుతూ వుంటే కదా, పై వాటికి విలువ వుంటుంది. ఏదైనా సాధిస్తే సార్థకత వుంటుంది. పైగా మరోవైపు ఉగ్రదాడులు… అంటే ప్రమాదం అంచున మనిషి దినదిన గండంగా గడపాల్సి వస్తోంది కదా? తమ స్థాయిలో తాము చేసే ఉద్యమాలే చరిత్రలో గొప్పగా నిలుస్తాయని కొందరు అనుకుంటూ వుంటారు. నిజమే! నిలుస్తాయను కుందాం. ఎప్పుడూ? అసలు మనిషనేవాడు బతికి వుంటే కదా? మనిషిలో మనిషితనం బతికి వుంటే కదా? మనిషి తనం కనుమరుగై, భౌతికంగా మనిషి బతికి వుంటే మాత్రం లాభం ఏమిటి? అడవిలో ఒక రకమైన జంతువులు, ఊళ్లో మరో రకమైన జంతువులు వుంటాయన్న మాట. ఆ ‘ఛాయలు’ నాగరికత బాగా నేర్చిన మహా నగరాల్లోనే ప్రస్ఫుటమవుతున్నాయి!
అందుకే మనిషిని, మనిషితనాన్ని బతికించుకోవాల్సిన అవసరం అత్యవసరంగా వుంది!!

డా. దేవరాజు
మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News