Tuesday, November 19, 2024

ఢిల్లీలో కాలుష్య కట్టడి చర్యలు

- Advertisement -
- Advertisement -

రోజు కూలీల జీవనోపాధి సంక్షోభం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లో అధ్వానంగా మారుతున్న వాయు నాణ్యతను కట్టడి చేయడానికి ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో అధికారులు ఆంక్షలు విధించగా, ఆ కాలుష్య నివారణ చర్యల భారాన్ని ప్రధానంగా ఎదుర్కొంటున్నది నిర్మాణ కార్యకలాపాల్లో పాల్గొంటున్న రోజువారీ వేతన కార్మికులే. వారి జీవితాలు స్తంభించాయి. మనుగడ కోసం రోజువారి ఆర్జనపై ఆధారపడుతుండే కార్మికులు తమ పిల్లలు ఆకలి చావులకు గురి కాగలరనే ఆందోళనతో ఉన్నామని చెప్పారు.

ప్రస్తుత ‘గ్రేడెడ్ రెస్పాన్స్ ఏక్షన్ ప్లాన్’ (జిఆర్‌ఎపి)4 చర్యల కింద నిర్మాణం, కూల్చివేత (సి అండ్ డి) కార్యకలాపాలను నిషేధించారు. ఢిల్లీలో అనేక ప్రాంతాలు ‘సివియర్ ప్లస్’ గాలి నాణ్యత (450 పైగా గాలి నాణ్యత సూచి ఎక్యుఐ)ని నమోదు చేసిన తరువాత ఆ నిషేధం అమలులోకి వచ్చింది. ‘మేము ఇంటిలోనే కూర్చుంటే మేము ఏమి తినాలి? మా పిల్లలకు ఏది తినిపించాలి?’ అని ఇద్దరు పిల్లల తల్లి, 45 ఏళ్ల సుమన్ అడిగింది. ప్రభుత్వ సహాయం అందుతుందనే ఆశతో ఆమె ఇటీవలే తన లేబర్ కార్డ్‌ను రెన్యూ చేసుకున్నది. కానీ అది నిష్ఫలమైందని ఆమె చెప్పింది. ‘వేతనాలు లభిస్తుండే ప్రభుత్వ ఉద్యోగాలు మాకు లేవు. మేము రోజువారీ ఆర్జనతోనే మనుగడ సాగిస్తాం.

పని లేకపోతే మా వద్ద ఏమీ ఉండదు’అని ఆమె చెప్పింది. కాగా, దేశ రాజధానిని దట్టమైన పొగ మంచు కమ్మివేసింది. గాలి నాణ్యత సూచి 488 దాటింది. నిషేధాజ్ఞల పరిధిలో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలు, అత్యవసర వస్తువులు రవాణా చేసేవి మినహా ట్రక్కు ప్రవేశాలపై ఆంక్షలు, పాఠశాలల మూసివేత కూడా ఉన్నాయి. తమ ఉద్యోగుల కోసం మార్పులు చేయవలసిందని కార్యాలయాలకూ ఆదేశాలు అందాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News