Sunday, November 24, 2024

కాలుష్య కోరలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో కాలుష్య సమస్య ఇప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించకుంది. ప్రాంత భేదాలు లేకుండా కాలుష్యం సమాన స్థాయిలో కోరలు సాచుతోంది. ఇక విధాన నిర్ణేతలు అయిన ప్రభుత్వ పాలకవర్గాలు కాలుష్య సమస్య నివారణ చర్యలను కేవలం నగరాలకే పరిమితం చేస్తున్నారు. దీనితో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు పలు విధాలుగా కాలుష్యానికి గురవుతూ ఉన్నాయి. సంబంధిత పరిశోధనల ప్రాతిపదిక సలహా సంప్రదింపులు, తీసుకోవల్సిన చర్యల సంస్థ క్లెమెట్ ట్రెండ్స్ ఇటీవల సంబంధిత కాలుష్య పరిణామంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. దీనికి సంబంధించి శాటిలైట్ ప్రాతిపదికన పలు స్థాయిలో వాయు ప్రమాణాల పర్యవేక్షణ చేపట్టారు. దీనికి ఐఐటి ఢిల్లీ నుంచి జాతీయ స్థాయి గణాంకాలను లెక్కలోకి తీసుకున్నారు.

గాలిరేణువులలో పేరుకుపొయ్యే కణాల లెక్కలో నిక్షిప్తం అయ్యే కాలుష్యాన్ని పిఎంల పరిణామాల్లో గణిస్తారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉండే నివాసిత పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని కాలుష్య వర్గీకరణలను క్రోడీకరించుకుని ఈ సమగ్ర నివేదికను రూపొందించారు. దీని మేరకు ఉత్తరప్రదేశ్‌లో కాలుష్య నివారణ చర్యలు 2017 సంవత్సరం నుంచి సత్ఫలితాలను ఇస్తూ వచ్చాయి. అక్కడ అర్బన్‌లో పిఎం 2.5 స్థాయిలో 37.18 శాతం కాలుష్యం తగ్గింది. ఇదే గ్రామీణ ప్రాంతాలలో 38.1 శాతం తగ్గుదల కన్పించింది. మహారాష్ట్రలో అత్యంత దారుణంగా కాలుష్యస్థాయి కేవలం 7.7 శాతం తగ్గింది. గుజరాత్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 8.2 శాతం మేర కాలుష్యం తగ్గిందని వెల్లడైంది.

ఇక శాటిలైట్ల నుంచి సేకరించిన లెక్కల ప్రకారం నగరాలలో 2017 నుంచి 2022 వరకూ పిఎం 2.5 స్థాయిలో కాలుష్య రేటును లెక్కకట్టారు. దీని మేరకు చెన్నైలో 2022లో కాలుష్య స్థాయి 28.90 గా ఉంది. ఇక కీలక పరిణామంగా గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్య నివారణకు ప్రభుత్వాలు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదనే విషయం స్పష్టం అయింది. కేవలం నగరాల్లో కాలుష్య స్థాయి నివారణకు చర్యలకే అధికార యంత్రాంగం పరిమితం కావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివిధ కారణాలతో అంతకు ముందటి ఆరోగ్యకరమైన వాతావరణానికి బీటలు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News