Thursday, January 16, 2025

ఐసీసీ అంతర్జాతీయ ఈవెంట్లకు భాగస్వామిగా పాలీక్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: భారతదేశంలో సుప్రసిద్ధ విద్యుత్‌ ఉత్పత్తుల కంపెనీ పాలీక్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీఐఎల్‌) నేడు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) మ్యాచ్‌లకు అధికారిక భాగస్వామిగా వ్యవహరించనుంది.ఈ భాగస్వామ్యంలో భాగంగా పాలీక్యాబ్‌, ఐసీసీ యొక్క పురుషుల, మహిళల అంతర్జాతీయ ఈవెంట్లకు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది, 2023 సంవత్సరాంతం వరకూ ఈ ఒప్పందం నిలిచి ఉంటుంది. దీనిలో భాగంగా దక్షిణాఫ్రికాలో జరుగనున్న ఐసీసీ ఉమెన్స్‌ టీ 20 వరల్డ్‌ కప్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో జరుగనున్న ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ చాంఫియన్‌షిప్‌ ఫైనల్‌ ; ఇండియాలో జరుగనున్న ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023 ఉంటాయి.

పాలీక్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ – చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ నిలేష్‌ మలానీ మాట్లాడుతూ ‘‘పాలీక్యాబ్‌కు ఇది అత్యంత సంతోషకరం. దేశీయంగా అభివృద్ధి చెందిన పాలీక్యాబ్‌ ఇప్పుడు 60కు పైగా దేశాలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌తో భాగస్వామ్యంతో మా అభిమానులకు మరుపురాని అనుభవాలను అందించనున్నాము’’ అని అన్నారు.

ఐసీసీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అనురాగ్‌ దాహియా మాట్లాడుతూ ‘‘2023 సంవత్సరాంతం వరకూ ఐసీసీ ఈవెంట్లకు అఽధికారిక భాగస్వామిగా పాలీక్యాబ్‌ నిలువనుందని వెల్లడించేందుకు సంతోషంగా ఉన్నాము. రాబోతున్న ఈవెంట్ల కోసం వారితో కలిసి పనిచేసేందుకు సంతోషిస్తున్నాము’’అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News