Saturday, November 23, 2024

పాలిగ్రాఫ్ టెస్టుకు ఐదుగురు నిందితుల సమ్మతి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులలో ఐదుగురు శుక్రవారం కోర్టు ఎదుట పాలిగ్రాఫ్ టెస్టుకు(నిందితులు నిజం మాట్లాడుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా తెలుసుకునే పరీక్ష)కు సమ్మతి తెలిపారు. నిందితులు మనోరంజన్ డి, సాగర్ శర్మ, అమోల్ ధనరాజ్ షిండే, నీలమ్ ఆజాద్, లలిత్ ఝా, మహేష్ కుమావత్‌ను శుక్రవారం అదనపు సెషన్స్ జడ్జి హర్దీప్ కౌర్ ఎదుట హాజరుపరచగా వారి పోలీసు కస్టడీని మరో 8 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. నిందితుల కస్టడీ కాలం శుక్రవారంతో ముగిసినందున వారిని పోలీసులు కోర్టులో పరిచారు. కాగా, లై డిటెక్షన్ టెస్టుగా కూడా వ్యవహరించే పాలిగ్రాఫ్ టెస్టుకు ఆజాద్ మినహాయించి మిగిలిన ఐదుగురు నిందితులు జడ్జి ముందు సమ్మతి తెలిపారు. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్టు జరపడానికి అనుమతిని కోరుతూ పోలీసులు కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News