Thursday, January 23, 2025

ఆనాధ బాలికలకు పాలిటెక్నిక్, డిప్లామా కోర్స్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ఆనాధ బాలికలకు పాలిటెక్నిక్, డిప్లామా కోర్సు ప్రవేశాల కోసం ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాల కోసం ధరఖాస్తుల ఆహ్వానం, ఆనాథ వసతి గృహంలో, ఇతర స్వచ్చంద సంస్ధలలో ఉంటూ 10వ తరగతి పూర్తి చేసినటువంటి ఆనాధ, నిరుపేద, తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురైన అక్రమ రవాణకు గురైన బాధిత బాలికల కోరకు ఎటువంటి అర్హత పరీక్ష లేకుండా నేరుగా పాలిటెక్నిక్ , డిప్లామా కోర్సు నందు ప్రవేశాల కోసం దఖాస్తులు చేసుకోవాలన్నారు.

ఈ కోర్సులలో ఆసక్తి వున్నటువంటి బాలికలు ఈ నెల 24వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం సిద్దిపేట కలెక్టరేట్ లోని జిల్లా బాలల పరిరక్షణ విభాగంను సంప్రదించాలన్నారు. సమాచరం కోసం 8184988260 నంబర్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News