Saturday, December 21, 2024

పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పేపర్ లీక్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ ప్రశ్రాపత్రాలు లీకయ్యాయి. ఈ నెల 8 నుంచి పాలిటెక్నిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశ్నా పత్రాల లీక్‌ను ఇతర జిల్లా కాలేజీల ప్రిన్సిపాల్స్ గుర్తించారు. బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పేపర్ లీకైనట్లు గుర్తించారు. క్వశ్చన్ పేపర్‌ను వాట్సాప్ ద్వారా విద్యార్థులకు పంపినట్లు గుర్తించారు. ప్రశ్నా పత్రాల లీక్ సంబంధించి కాలేజీపై బోర్డు సెక్రెటరీ ఫిర్యాదు చేసింది. స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News