Saturday, December 21, 2024

తెలంగాణ వ్యవసాయ పథకాలు భేష్

- Advertisement -
- Advertisement -
పాండిచ్చేరి మంత్రి జై కుమార్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసయారంగం కోసం అమలు చేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని పాండిచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి జై కుమార్ వెల్లడించారు. రైతుబంధు, రైతుబీమా , వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ తదితర పథకాలు వాటి అమలు తీరు ఎంతో బాగుందని సంతృప్తిని వ్యకం చేశారు. మంత్రి జై కుమార్ సోమవారం పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలోని పశు వైద్య కళాశాల డెయిరీ , మేకల ఫామ్ సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగాపశు వైద్య కళాశాలలో అమలవుతున్నటువంటి గోకుల్ గ్రామ్ పథకం కింద చేపట్టిన వివిధ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డెయిరీ వ్యర్ధాలను ఎలా వినియోగించుకోవాలని తెలుసుకున్నారు. తదుపరి కళాశాలలోని గోట్ ఫామ్ లోనీ వివిధ జాతులను పరిశీలించారు. అనంతరం అత్తాపూర్ లోని కేఎంజి డెయిరీని సందర్శించారు అక్కడ ఉన్నటువంటి ముర్రా జాతి గేదెల యాజమాన్య పద్ధతులు వాటిలభ్యతను మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్‌ను అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోనీ భస్తే పూర్ , సింగప్పగూడెం లో ఆధునిక పద్ధతులను ఉపయోగించుకొని పెంచుతున్న మేకల ఫారాలను కూడా సందర్శించారు . ఈ పర్యటనలో పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ మహేందర్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అధికారి షేక్ మీరా,డాక్టర్ జె.వి ప్రసాద్, డాక్టర్ భాస్కరన్ డాక్టర్ రాజన్న, డాక్టర్ ఆర్‌ఎంవి ప్రసాద్ , హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News