Wednesday, September 18, 2024

బఫర్ జోన్ అంటేనే భయం పుట్టిస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: చె రువులను కాపాడుకుందాం, చెరువులను పునరుద్ధరిద్దాం, చెరువు కు చెరువులకు మధ్య లింకులను ఏర్పాటు చేద్దామని హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసె ట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ ఏవి రంగనాథ్ పిలుపునిచ్చారు. చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టే ప్ర యత్నం చేస్తే చట్టపరమైన కేసు లు తప్పవని ఆయన హెచ్చరించారు. సోమవారం హైడ్రా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంగనాథ్ మాట్లాడుతూ చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ల పరిధిలో అనుమతులు మంజూరు చేసినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చందానగర్ ఈర్ల చెరువు బఫర్ జోన్‌లో బిల్డింగ్ అనుమతి మంజూరు చేశారనీ, ఓసి(ఆక్యుపెన్సీ సర్టిఫికేట్) కూడా జారీ చేశారనీ అయినా హైడ్రా వెళ్ళి అనుమతులు నియమావళికి విరుద్ధంగా బఫర్ జోన్‌లో ఉన్నాయని చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ తరహా నిర్మాణాలను కూడా ఉపేక్షించమని రంగనాథ్ హెచ్చరించారు.

దశలవారీగా ముందుకు
ఔటర్ రింగ్ రోడ్‌లోపలి వైపుల 455 చెరువులు ఉన్నాయనీ వీటి ఆక్రమణలపై నిరంతరం ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయనీ, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, విచారించి, అధికారులతో చర్చించిన అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మొదటిదశలో చెరువుల్లోకి ఆక్రమణలు రాకుండా నివారించడం, రెండోదశలో చెరువుల్లో ఉన్న నిర్మాణాలు, కబ్జాలు, ఘన వ్యర్థాల పూడికను తొలగించడం, మూడోదశలో చెరువుల పునరుద్ధరణ తగిన ప్రణాళికలతో చేపట్టడం ఉంటుందన్నారు. ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లలో ఎన్‌ఓసిలు ఉన్నా, నిర్మాణ అనుమతులు పొందినా వాటిని రద్దు పరిచే విధంగా ఆయా విభాగాలకు సూచించడం, వాటిని జారీచేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడేది లేదని ఆయన స్పష్టంచేవారు.

త్వరలోనే పోలీసుస్టేషన్
హైడ్రాను మూడు డివిజన్లుగా ఏర్పాటు చేయాలనే యోచనతో ఉన్నామనీ, ముందుగా ఒక ఏసిపి స్థాయి అధికారితో ఓ హైడ్రా పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో 6 టీంలు మాత్రమే ఉన్నాయని, అయితే, హైడ్రాకు 72 టీంలు అవసరమని సూచన ప్రాయంగా తెలిపారు. అసెట్స్ ప్రొటెక్షన్ విభాగం ప్లానింగ్ విభాగంతో, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ట్రాఫిక్ పోలీసుతో సమన్వయం ఉంటుందనీ పేర్కొన్నారు. చెరువులతో పాటు నాలాలు, వరద కాలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాలాలు కబ్జాలపైనా చర్యలు ఉంటాయనీ, అయితే, ముందుగా చెరువుల సమస్యలను తీసుకుని ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఎన్‌ఆర్‌ఎస్‌సి అందించిన సమాచారం ప్రకారంగా చెరువులు 60 80 శాతం వరకు చెరువులు ఆక్రమణలకు, పూడ్చివేయడం జరిగిందని చెప్పారు. చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లపై విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు.

కేసులు పెడతాం
చెరువుల పరిధిలో లేఅవుట్లు వేసి ప్లాట్లను, ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టే బిల్డర్లపై చట్టపరంగా కేసులు పెడతామని రంగనాథ్ హెచ్చరించారు. కొనుగోలుదారులు కూడా నిర్మాణాలను, ప్లాట్లను ఖరీదు చేసే సమయంలో వాటికి అధికారిక అనుమతులు ఉన్నాయా ? లేదా పరిశీలించి అన్నీ అనుమతులు ఉన్నాయనీ, చట్టపరంగా చెల్లుబాటు అవుతుందని నిర్థారించుకున్నాకే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. డెబ్రీస్, గార్బేజీలను చెరువుల్లో వేసే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని వెల్లడించారు. చెరువులు, వరద కాలువలు, నాలాలను ఆక్రమించుకోవాలంటే జంకే పరిస్థితిని కల్పిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రస్తుతం చెరువుల సర్వే జరుగుతుందనీ, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఉపేక్షించేది లేదని రంగనాథ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News