Tuesday, January 21, 2025

‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి ప్రతీక పొంగల్:ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ జాతీయ స్ఫూర్తిని పొంగల్ పండుగ ప్రతిబింబిస్తుందని, అదే భావోద్వేగం కాశీ=తమిళ్, సౌరాష్ట్ర=తమిళ్ సంగమంలో కానరాగలదని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం చెప్పారు. దేశ రాజధానిలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకలలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, పండుగ వాతావరణం తమిళనాడులో ప్రతి ఇంటిలో కానవస్తుందని చెప్పారు. ప్రజలు అందరి జీవితాలలో ఆనందం, సౌభాగ్యం, సంతృప్తి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. ‘కోలం’ (ముగ్గు)తో దేశంలోని విభిన్న ప్రాంతాలలో కానవస్తున్న సామీప్యతల గురించి మోడీ ప్రస్తావిస్తూ, దేశంలోని ప్రతి ప్రాంతం పరస్పరం భావోద్వేగంలో అనుసంధానమై ఉంటుందని, దేశ బలం కొత్త రూపులో కనిపిస్తుంటుందని చెప్పారు.

పొంగల్ పండుగ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది’ అని మోడీ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని కాశీ=తమిళ్ సంగమం, సౌరాష్ట్ర-=తమిళ్ సంగమంలో వీక్షించవచ్చునని, తమిళులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా ఇందులో పాల్గొంటుంటారని ఆయన తెలిపారు. ‘ఈ ఏకత్వ భావన 2047 కల్లా వికసిత్ భారత్ నిర్మాణానికి అతిపెద్ద శక్తి అవుతుంది. ఎర్రకోట నుంచి నేను ప్రవచించిన పంచ్ ప్రాణ్‌లోని ప్రధాన సూత్రం దేశ సమైక్యతను శక్తిమంతం చేస్తుంది’ అని ప్రధాని చెప్పారు. సిరి ధాన్యాలు, తమిళ సంప్రదాయాల మధ్యసంబంధం గురించి తాను గతంలో చేసిన ఒక ప్రసంగాన్ని మోడీ గుర్తు చేస్తూ, ‘సూపర్ ఫుడ్ శ్రీ అన్న’ (సిరి ధాన్యాలు) గు రించి జనంలో ‘కొత్త చైతన్యం’ కానవస్తుండడం పట్ల, యువజనులు అనేక మంది సిరి ధాన్యాలపై స్టార్టప్ వేదికలకు ఉపక్రమించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సిరి ధాన్యాల సాగు చేపట్టిన మూడు కోట్ల మందికి పైగా రైతులు వాటిని ప్రోత్సహిస్తూ లబ్ధి పొందుతున్నారని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News