- Advertisement -
ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతకు బీఆర్ఎస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మేడిగడ్డ కూలిపోయింది గత ప్రభుత్వ హయాంలోనేనని ఆయన చెప్పారు. మరి ఆనాడు మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లు ఎందుకు నిల్వ చేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్నీ తానేనని చెప్పుకునే కేసీఆర్.. ఇప్పుడు దానిపై చర్చ జరుగుతుంటే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై శ్వేతపత్రం మీద అసెంబ్లీలో జరిగిన చర్చలో పొంగులేటి మాట్లాడారు.
కొత్త ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదని, కేవలం సలహాలు ఇచ్చే హక్కే ఉందని అన్నారు. చేవెళ్ల ప్రాజెక్టుకు పేరు మార్చడమే శాపంగా పరిణమించిందన్నారు.
- Advertisement -