Wednesday, December 25, 2024

ఇలా చేరి.. అలా గెలిచారు!

- Advertisement -
- Advertisement -

తెలంగాణా ఎన్నికల్లో లాస్ట్ మినిట్ లో ఎంట్రీ ఇచ్చి, విజయం సాధించిన అభ్యర్థులున్నారు. ‘ఎప్పుడు ఎంటరయ్యామన్నది కాదు బ్రదరూ… గెలిచామా లేదా అనేదే పాయింటు’ అని ఇప్పుడు ఆ అభ్యర్థులు మీసం మెలేస్తున్నారు. వీరిలో బీఆర్ఎస్ టికెట్లు దక్కక, చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేరి గెలిచిన క్యాండిడేట్ల గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. అలాంటివారిలో ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి, తుమ్మల ముందు వరుసలో ఉంటారు. ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ లో  చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నుంచి, తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంనుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇల్లెందునుంచి గెలిచిన కోరం కనకయ్య, పినపాకనుంచి విజయం సాధించిన పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటనుంచి గెలుపొందిన ఆదినారాయణ కూడా బీఆర్ఎస్ టికెట్లు రాక భంగపడినవారే. సత్తుపల్లినుంచి గెలిచిన డాక్టర్ మట్టా రాగమయిది కూడా ఇదే తీరు. తుంగతుర్తి నియోజకవర్గంలో బిఆర్ఎస్ నుంచి మందుల సామేల్ టికెట్ ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేరి గెలుపొందారు. నకరేకల్ లో బిఆర్ఎస్ పార్టీ నుంచి వేముల వీరేశానికి టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ లో చేరి భారీ మెజార్టీతో ఆయన విజయం సాధించారు.

పాలమూరు జిల్లాలోనూ ఇలాంటి కేసులు ఉన్నాయి. నాగర్ కర్నూలునుంచి కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, వనపర్తినుంచి మేఘారెడ్డి, కల్వకుర్తినుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా బీఆర్ఎస్ టికెట్లు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ లో చేరి గెలుపొందారు.

ఇక బీజేపికి గుడ్ బై చెప్పి, చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేరి గెలిచినవారిలో గడ్డం వివేక్ (చెన్నూరు), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు) ప్రముఖులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News