Monday, January 13, 2025

మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం.. ఒకేసారి రెండు టైర్లు బ్లాస్ట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం వరంగల్ జిల్లాలో సమీక్ష ముగించుకుని వరంగల్ నుండి ఖమ్మం వెళ్తుండగా తిరుమలాయపాలెం వద్ద ఆయన కారుకు ప్రమాదం జరిగింది. మంత్రి పొంగులేటి ప్రయాణిస్తోన్న కారు రెండు టైర్లు ఒకేసారి పేలడంతో కారు అదుపు తప్పింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కారును కంట్రోల్ చేశాడు. దీంతో పొంగులేటి ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనంలో ఆయన ఖమ్మం చేరుకున్నారు. పొంగులేటి తృటిలో ప్రమాదం నుండి తప్పించుకోవడంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై మంత్రి సిబ్బంది ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News