Wednesday, April 2, 2025

మూడోసారి సిఎం కావాలన్న డ్రీమ్‌పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్న కె.చంద్రశేఖర్‌రావు ఆశకు గండి పడుతుందని పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్‌లో జరిగిన తిరుగబడడం-తరిమికొడదాం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్ ప్రజలకు మాయమాటలు చెప్పారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిందని పొంగులేటి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడిన పొంగులేటి, ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News