Sunday, January 19, 2025

జర్నలిస్టు సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చిన పొంగులేటి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ , సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. అలాగే చిన్న , మధ్య తరహా పత్రికల మనుగడ కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు కె. కోటేశ్వర రావు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వర రావులు మంత్రి పొంగులేటిని కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల సూచనలపై పలు అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

Ponguleti2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News