Monday, December 23, 2024

పొంగులేటి… ప్రజాశాంతి పార్టీలో చేరండి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ పార్టీ నుంచి పోటీచేస్తే వచ్చే ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాల్లో ఆయన వర్గీయులే గెలుస్తారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. కాంగ్రెస్ కుటుంబ పాలనతో రాష్ట్రం దివాళా తీస్తే… ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. కేంద్రంలో బిజెపిది ఇదే తీరని మండిపడ్డారు. పొంగులేటి ప్రజా శాంతి పార్టీలోకి రండి..ఇద్దరం కలిసి పోటీ చేస్తే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అప్పుడు తాను ముఖ్యమంత్రైనా నిన్ను ఉప ముఖ్యమంత్రిని చేస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ అన్నారు.

ఆదివారం ఖమ్మం నగరం కస్పా బజార్‌లో ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన విలేఖర్లతో మాట్లాడ్తూ పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొద్దని సూచించారు. స్వంత పార్టీ పెడితే పొంగులేటి నష్ట పోతారని కర్నాటకలో లక్షా కోట్లు ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఒకే సీటు గెలిచారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా ఆరు నెలలు నేను ఉంటా ఆతరువాత మీరు ఉండవచ్చాన్నారు.అన్నీ గ్రామాల లో మీటింగ్ పెడదాం, లక్షా మంది నీ పిలుస్తా…. అధికారంలోకి వస్తే…. అప్పులు తీరుస్తా…. ఉచిత విద్య వైద్యం అందిస్తానని.. రైతు బంధుగా రూ.10 వేలు, వితంతువులకు రూ.4 వేల పింఛన్, నిరుద్యోగులకు ఆరు వేల భృతిని ఇస్తామన్నారు.

బిల్ గేట్స్, బిల్ క్లింటన్‌ను తెలంగాణకు తీసుకొస్తానన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని అన్ని రాష్ట్రాల్లో బలం తగ్గిందన్నారు. కర్ణాటకలో క్రైస్తవుల మద్దతుతో గెలిచిందన్నారు. దేశంలో కాంగ్రెస్ 50 ఏళ్లైనా అధికారంలోకి రాదన్నారు. ఏపీ మాజీ సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ఒక డ్రామా అని ఆయన అన్నారు. చంద్రబాబు అంత బూటకపు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజాశాంతిని గ్రామస్థాయిలో బలోపేతం చేయనున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News