Thursday, December 26, 2024

గ్రామ సభలతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతీ పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించామన్నారు. 24 లక్షల ఇళ్లు పేదలకు ఇస్తామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చామని.. ఇచ్చిన మాట ప్రకారం ఇండ్లు ఇస్తామని చెప్పారు.

మొదటి విడతలో స్థలం ఉన్నవారికి నిర్మాణం కోసం డబ్బులు ఇస్తామని ఆయన చెప్పారు. గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలోనే రోల్‌ మోడల్‌గా కొత్త ఆర్‌వోఆర్‌ చట్టం తీసుకువస్తామన్నారు. రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతుల రుణమాఫీ చేయాల్సి ఉందని, డిసెంబర్ 9వ తేదీ లోపు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News