Wednesday, January 22, 2025

బిఆర్ఎస్ కు ఒక్క సీటూ దక్కనీయను: పొంగులేటి సవాల్

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి ఖమ్మం జిల్లా అసెంబ్లీ సీట్లలో బిఆరెస్ నాయకులను ఒక్కరినీ కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కనీయనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) సస్పెండ్ చేసింది. ఈ సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. ”2014, 2018లో వచ్చిన ఒక్క సీటు కూడా మీకు దక్కనీయను. మీ పార్టీలో ఎవరికీ గౌరవం లేదు, కొద్ది రోజులలో అందరూ బయటకు వస్తారు. గత వంద రోజులుగా గుర్తుకు రాని సస్పెన్షన్, జూపల్లి ఖమ్మం రాకతో ఎందుకు గుర్తుకు వచ్చింది. నన్ను రాజకీయ సమాధి చేయాలని చూసింది నిజం కాదా కేసీఆర్. నా కొడుకు రిసెప్షన్ కు వచ్చిన ప్రజలను చూసి కళ్ళు కుట్టాయా?. నన్ను నమ్ముకున్న వేలాది మందిని ఇబ్బంది పెట్టి, ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా మిమ్మల్ని నమ్మే ఉన్నాను ఇప్పటి వరకు. నే నమ్మిన సిద్ధాంతం కోసం, నన్ను ఆశీర్వదించే ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడుతా.

Also Read: పేపర్ లీక్.. నన్ను ఇరికించాలని సిఎం కెసిఆర్ కుట్ర పన్నారుః ఈటెల

రాజకీయంగా నన్ను ఇబ్బందులకు గురి చేయవచ్చు… కానీ ప్రజలలో ఉన్న నన్ను ఏమి చేయలేరు. సింగరేణి ఎన్నికలలో 32రోజులు కొత్తగూడెంలో ఉండి పని చేసినా.. మీరిచ్చిన గౌరవం ఏమిటి. తండ్రిలా భావించా, ప్లీనరీకి 2 కోట్లు రూపాయలు ఇచ్చినా దక్కిన గౌరవం ఏమిటి. మీ మాటలు మేడి పండులే అయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో యోధానుయోధులను ఎలా అగౌరపరిచారో, ఇప్పుడు నాకు అదే జరిగింది. అందుకే నా ప్రజలకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. ప్రజలలోకి వెళ్తాను, ప్రజాలలోనే ఉంటాను. భగవంతుడు తప్పు చేసిన వారి అందరినీ శిక్షిస్తాడు.

Also Read: అవార్డులు ఇస్తారు కానీ నయా పైసా ఇవ్వరు: హరీశ్ రావు

ఒకే కుటుంబమనే మీరు ఇప్పటి వరకు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు. కోర్టులు శిక్షలు విధించినా, కోర్కెలేమిటని ముద్దాయిలను అడుగుతారు. పార్టీల నుండి బయటకు పంపేటప్పుడు కనీసం విజ్ఞత లేదు.. ఇప్పుడు మిమ్మల్ని తప్పుపడుతున్నాను. నీళ్లు నిధులు నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికి వరదలా వెళ్లాయి. కేసీఆర్ కుటుంబమే బంగారు కుటుంబం అయ్యింది. ఒక్క ఖమ్మం జిల్లానే కాదు, నాలా నష్టపోయిన వందలాది మంది నేతలలో రాజకీయ నిర్ణయం తీసుకుంటా” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News