Monday, January 27, 2025

ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దు

- Advertisement -
- Advertisement -

ఇది ప్రజా ప్రభుత్వం..ప్రజల మేలు కోరేది
ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియ.. అర్హులైన ప్రతి
లబ్ధిదారుకీ అందుతాయి మంత్రి పొంగులేటి

మన తెలంగాణ/హసన్‌పర్తి: తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల మేలు కోరేదని మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హసన్‌పర్తి మండలం, పెంబర్తి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చే స్తున్న 4 పథకాలు ఇందిర మ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను మంత్రి కొం డా సురేఖ, ఎంపి డాక్టర్ కడియం కావ్య, ఎంఎల్‌ఎలతో కలిసి ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, సురేఖ మాట్లాడుతూ.. రైతు భరోసా పథకం ప్రారంభించామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా గ్రామంలోని అర్హులందరికీ భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు మొదటి విడతగా రూ. 6000 చొప్పున ఆత్మీయ భరోసా అందిస్తున్నామన్నారు.

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఇళ్లు లేని పేద కుటుంబాలకు విడతల వారీగా ఎంపిక చేసేందుకు పెంబర్తి గ్రామాన్ని మోడల్‌గా తీసుకున్నామని అన్నారు. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా.. రైతు భరోసా పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న రూ.10 వేలను 12 వేలకు పెంచామని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రైతులకు రుణమాఫీ కింద రూ.2 లక్షలు మాఫీ చేశాం. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు కెఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News