Monday, December 23, 2024

నాటు బాంబు కాదు.. ఆటంబాంబే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వర్ధన్నపేట/తొర్రూరు ప్రతినిధి: నాటు బాంబు..లక్ష్మీబాంబు కాదు..త్వరలో ఆటం బాంబ్ పేలబోతోందని- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే.. భుజాలు తడుముకుంటున్నారని, -తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదని, తప్పు చేయకపోతే ఉలికిపా టు ఎందుకని, రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో బయటపడతాయని కెటిఆర్‌పై విరుచుకుపడ్డారు. తాను చేసిన వ్యాఖ్యలపై శ్రీనివాస్‌రెడ్డి ఎవరు హోం మంత్రా, డిజిపినా అని కెటిఆర్ అడుగుతున్న తీరు ఆయన ఉలికిపాటుకు అ ర్ధం పడుతుందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వర్ధన్నపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతకుముందుకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ పేరు ఎత్తకుండానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రికి జ్ఞానం కలిగినట్టు లేదు. శ్రీనివాస్‌రెడ్డి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు హోం శాఖ కాదు, రెవెన్యూశాఖ కాదు ఏ శాఖ గురించైనా మాట్లాడవచ్చన్న కనీస పరిజ్ఞానం లేదా అని ప్రశ్నించారు. పొలిటికల్ బాంబులు పేలుతాయని చెప్పగానే నీకు అంత భయమెందుకు, ఎందుకు ఉలికిపడుతున్నావ్? నేను నీ పేరు, నీ బావ పేరో, నీ నాయన పేరో, నీ తోడళ్లుడి పేరో తీసుకోలేదు, ఈ పార్టీ ఆ పార్టీ అనలేదు, ఎందుకు నీకు ఉలికిపాటు.

నీకు, మీ నాయనకు, నీ బావకు, మీ పింకు కలర్ చొక్కా వేసుకున్న నాయకులకు తెలుసు ఆ నాడు పేద వాడి సొమ్ము, పేదవాడి సొత్తు ఎలా కొల్లాగొట్టారో తెలుసు కాబట్టే ఉలికిపడుతున్నావ్. గతంలో చెప్పా మళ్లీ చెబుతున్న పాదయాత్ర చేస్తానంటున్నావ్, మోకాళ్ల యాత్ర చేస్తామనంటున్నావ్ నువ్వు ఏ యాత్ర చేసినా నేను, కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కళ్లు పైకెక్కి సామాన్య ప్రజలను అనాడు పట్టించుకోకుండా పదేళ్లు పేదవాడిని నడిరోడ్డు మీద వదిలిపెట్టి కనీసం మనిషిని మనిషిగా గౌరవించని మీరు పదవిపోయి పదినెళ్లు గడువకముందే పేదవాడి కష్డం ఏమిటో, మనిషిని ఎలా ప్రేమించాలో, ఎలా గౌరవించాలో, ఎలా చూసుకోవాలో జ్ఞానోదయం కలుగుతుందన్నందుకు సంతోషిస్తున్నానని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేస్తావో మోకాళ్ల యాత్ర చేస్తావో నిర్ణయం తీసుకుని పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లక్ష కోట్లు కొల్లగొట్టిన సొమ్ము నుండి ప్రతి గ్రామ పంచాయతీకి రూ.కోటి నుండి రూ.2 కోట్లు ఇచ్చి పాపాలను శుద్ధి చేసుకోండి అంటూ హితవు పలికారు. తెలంగాణలో మీరు చేసిన దోపిడీ, ఆరాచకాలు, చట్టాన్ని ఏ రకంగా వాడుకున్నారో ప్రతి బిడ్డకు తెలుసు అని అన్నారు.

కెసిఆర్ కాళ్లు పట్టుకుంటే తడిగుడ్డతో గొంతు కోశారు
తండ్రితో సమానమని భావించి ఒక్కసారి తాను పార్టీలో చేరే సందర్భంలో లక్షలాది మంది సమక్షంలో కెసిఆర్ కాళ్లు పట్టుకుని దీవెనలు కోరితే మీ నాయన, నువ్వు, నీ కుటుంబం నాతో పాటు ఉండే లక్షలాది కార్యకర్తలను తడిగుడ్డతో గొంతు కోస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో గుర్తు తెచ్చుకోవాలని, సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి అనాడు కెసిఆర్ కాళ్లు మొక్కానని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అంబానీ కాల్లో, ఇంకెవరి కాల్లో నాలుగు గోడల మధ్య పట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు కాని, భవిష్యత్తులో కాని శ్రీనివాస్‌రెడ్డికి ఉండదని చెప్పారు.

నువ్వు చేసిన తప్పులు ఏంటో నీకు తెలుసు. నీకు పడబోయే శిక్షలు ఎంటో కూడా మీకు తెలుసు అంటూ కెటిఆర్ పేరు చెప్పకుండానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ చట్టం తన పని తను చేసుకుపోతుందని సభలో ప్రకటించారు. పాలకుర్తి ఎంఎల్‌ఎ మామిడాల యశస్వినిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు పొరిక బలరాంనాయక్, కడియం కావ్య, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎంఎల్‌ఎ డాక్టర్ జె.రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎంఎల్‌ఎ డాక్టర్ మురళీనాయక్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News