Sunday, January 19, 2025

మేడారంలో మీడియా పాయింట్ ను ప్రారంభించిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సోమవారం మేడారంలో పర్యటించారు. వనదేవతలను దర్శించుకున్న అనంతరం మంత్రులు.. మేడారం జాతరంలో రూ.10 లక్షల అంచనా వ్యయం ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ ను ప్రారంభించారు.

ఈ నెల 21 నుంచి 26 వరకు ఘనంగా జాతర నిర్వహిస్తున్నామని.. దాదాపు 2 కోట్ల మంది భక్తులు జాతరకు తరలి రానున్నారని మంత్రి చెప్పారు. ఈ క్రమంలో మేడారం జాతరకు వస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గత ప్రభుత్వంలో 3వేల బస్సులు నడిపితే, ఈసారి 6వేల ఆర్టిసి బస్సులు జాతరకు నడుపుతున్నామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం మంచి నీరు, టాయ్ లెట్ లు వేల సంఖ్యలో ఏర్పాటు చేశామని మంత్రి పొంగులేటి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News