Sunday, January 19, 2025

తెలంగాణకు కెసిఆర్ చేసిందేమీ లేదు: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: తెలంగాణకు సిఎం కెసిఆర్ చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొంగులేటితో పాటు పిడమర్తి రవి, అరికెల నర్సా రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కనకయ్య, డివి రావు, పాపిరెడ్డి, తదితరలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంలో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో పొంగులేటి మాట్లాడారు. ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. కెసిఆర్‌వి మాటలే కానీ చేతలు ఉండవన్నారు. సిఎం కెసిఆర్‌వి అన్న మోసపూరిత మాటలు, వాగ్ధానాలేనని మండిపడ్డారు. సిఎం కెసిఆర్ రైతులకు రుణమాఫీ అని చెప్పి ఇప్పటికీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు డిక్లరేషన్‌లో చెప్పినవన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బిఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో వేయాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.

Also Read: కెసిఆర్ మాటలు కోటలు దాటాయి.. ప్రగతి భవన్ గడప దాటలేదు: కిషన్ రెడ్డి

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News