Monday, December 23, 2024

కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ఱారావు కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ నేతలంతా వెనక్కి రావడం ఆనందంగా ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. ఘర్ వాపసీ కార్యక్రమం జరుగుతోందన్నారు. కెసిఆర్ హఠావో-తెలంగాణ బచావో నినాదంతో ముందురు వెళ్లాలని కాంగ్రెస్ నాయకులకు రాహుల్ సూచించారు. జులై 2న ఖమ్మం సభకు రాహుల్ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించారు. ఖమ్మం సభకు రావాలని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News