Wednesday, January 22, 2025

ఇండస్ట్రియల్ పార్కుతో ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వరంగల్ ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క అన్నారు. జిల్లాలోని గణపురం మండలం, మైలారంలో 60 ఎకరాల్లో నిర్మించే ఇండస్ట్రియల్ పార్కును స్థానిక ఎంఎల్‌ఎ గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మంత్రులు శనివారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. అందులో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని అన్నారు.

ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు స్థలానికి ముందుగా ప్రహారీ, రోడ్లు, విద్యుత్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చి న హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపా రు. పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఇచ్చి ఆదుకుంటామని అన్నారు. రామప్ప చెరువు నుంచి గణపురం పెద్దచెరువుకు పైపు ద్వారా నీరందిస్తే 4 మండలాల్లోని 4 4,700 ఎకరాలకు సంవత్సరం పొడవునా సాగునీరు అందుతుందన్నారు. అందుకు కోట్ల నిధులు అ వసరం పడతాయని తెలిపారు. మొదటి ప్రాతిపదికన కృషి చేయాలని స్థానిక ఎంఎల్‌ఎ మంత్రులను కో రారు. కార్యక్రమంలో కడియం కావ్య, వర్థన్నపే ట ఎంఎల్‌ఎ నాగరాజు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్‌పి కిరణ్‌ఖారే తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News