Sunday, January 19, 2025

తుమ్మల నాగేశ్వర రావుతో పొంగులేటి భేటీ…

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. శనివారం ఉదయం తుమ్మల నివాసానికి వెళ్లిన పొంగులేటి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశమయ్యారు. ఇద్దరు భేటీ అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. “పొంగులేటి నా చిరకాల మిత్రుడు. కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి ఆహ్వానించారు. నన్ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించినందుకు పొంగులేటికి ధన్యవాదాలు. నేను ఏ పార్టీలో ఉన్నా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తా. సీతారామ ప్రాజెక్టులోకి గోదావరి జలాల విడుదల చూడాలన్నది నా లక్ష్యం. సీతారామ ప్రాజెక్టు పూర్తి కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటా” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News