Monday, December 23, 2024

కాంగ్రెస్ జనగర్జన సభపై బిఆర్ఎస్ కుట్ర.. అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: కాంగ్రెస్ జనగర్జన సభను ఫెయిల్ చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నించిందని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. ”బిఆర్ఎస్ సభను తలదన్నేలా కాంగ్రెస్ జనగర్జన సభ ఉంటుంది. 150 ఎకారాల్లో ఏర్పాటు చేసిన భారీ సభకు ఆర్టీసి బస్సులు ఇవ్వడం లేదు.. అయినా ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. ప్రైవేట్ వాహనాలు రాకుండా పోలీసులు తనిఖీల పేరుతో జులుం చెలాయిస్తున్నారు. చెక్ పోస్టులు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆర్ సి, సిబుక్ లను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 1700 వాహనాలను సీజ్ చేశారు. రాత్రి నుంచి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. అవసరమైతే నేను రోడ్డుమీదకు వస్తా. ప్రభుత్వానికి అధికారులు చెంచాగిరి చేస్తున్నారు. అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సభకు ప్రజలను రానివ్వకుండా సభను ఫెయిల్ చేసేందుకు బిఆర్ఎస్ చూస్తోంది. ఈ సభతోనే కెసిఆర్ ప్రభుత్వ పతనం మొదలవుతుంది” అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News