Thursday, December 19, 2024

సమ సమాజం తలదించుకునేలా హరీష్ రావు మాటలు: మంత్రి పొంగులేటి

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఫైరయ్యారు. బుదవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సందర్భంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడిచింది.  ఈ క్రమంలో ఇరువర్గాల సభ్యులు ఘాటు విమర్శలు చేసుకున్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై విమర్శిస్తూ.. కొందరు సభ్యులు పొద్దున్నే మద్యం సేవించి సభకు వస్తున్నారని.. సభలో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొందని..కాబట్టి, అసెంబ్లీ బయట కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో హరీష్ రావుపై మంత్రి పొంగులేటి తీవ్రంగా మండిపడ్డారు. హరీష్ రావు చాలా బాధాకరంగా మాట్లాడారని.. సభనే కాదు సమసమాజం తల దించుకునేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.. సభా సాక్షిగా హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News