Friday, November 22, 2024

మేడారానికి భక్తులు వెల్లువ…. సమ్మక్కసారలమ్మను దర్శించుకున్న పొంగులేటి

- Advertisement -
- Advertisement -

ములుగు: రెండు సంవత్సరాల కొకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. 70 రోజుల క్రితం మార్పు కోసం ప్రజల దీవెనతో సమ్మక్క, సారక్క తల్లుల దీవెనలతో తెలంగాణాలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో స్థానిక మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కనీ వినీ ఎరుగని రీతిలో జాతర జరుగుతుందని కొనియాడారు. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకోవడం జరిగిందని, ఒక పక్క అసెంబ్లీ నడుస్తున్న భక్తుల సౌకర్యం కోసం మంత్రి సీతక్క నిత్యం జాతర పనులను పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లు చేశారని,
అంటే ప్రభుత్వానికి, ప్రజలు, భక్తుల పట్ల ఎంతో చిత్త శుద్ది ఉందో తెలుస్తుందని మెచ్చుకున్నారు.

Ponguleti srinivas reddy visited Sammakka saralamma

గత ప్రభుత్వం మేడారం జాతరకు 75 కోట్లు ఖర్చుపెడితే ఈ ప్రభుత్వం నష్టాలలో ఉన్నా రూ.110 కోట్లు మంజూరు చేసిందని, ఈ నెల 21 నుంచి 26 వరకు ఘనంగా జాతర నిర్వహిస్తున్నామని, ఇంకా 2 కోట్ల మంది భక్తులు జాతరకు తరలి రానున్నారని, భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వంలో 3వేల బస్సులు నడిపితే, ఈ ప్రభుత్వంలో 6వేల ఆర్టిసి బస్సులు జాతరకు నడుపుతున్నామని, ఎన్నికల హామీలలో చెప్పిన విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, జీరో టిక్కెట్టుపై ఇప్పటి వరకు 17 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని స్పషటం చేశారు. జాతర నిర్వహణకు 16 వేల మంది అధికారులు పనిచేస్తున్నారని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి 4 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించామని, గతం మేడారం జాతరపై అనుభవం ఉన్న ఐదుగురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని పొంగులేటి పేర్కొన్నారు.

జాతరకు అనుసంధానమయ్యే సుమారు 270 కిలో మీటర్ల రోడ్లు నూతనంగా నిర్మించామని పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని, ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, ప్రజల సౌకర్యార్థం మంచి నీరు, టాయ్ లెట్ లు వేల సంఖ్యలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నాలుగు రోజులలో 2 కోట్ల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని, భక్తులు అధికారులకు సహకరించి నిదానంగా దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకోవాలని పొంగులేటి కోరారు. గత ప్రభుత్వంలో నష్టపోయిన కోరికలను రాబోయే 5 సంవత్సరాలలో సిఎం రేవంత్ రెడ్డి సహకారంతో నెరవేరాలని అమ్మవార్లను కోరుకుందామని భక్తులకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News