Sunday, January 5, 2025

కురుక్షేత్ర యుద్ధ సమయం ఆసన్నమైంది: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: కురక్షేత్ర యుద్ధ సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రేపటి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం ప్రారంభిస్తారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం యువతను నట్టేట ముంచిందని, ప్రభుత్వ అసమర్థత వల్లే రెండు సార్లు గ్రూప్ -1, 2 పరీక్షలు రద్దు చేశారని దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో చిత్తశుద్ధి కనిపించడంలేదని పొంగులేటి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News