Monday, December 23, 2024

కొత్త భూచట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: భూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శ్రీకారం చుట్టార ని, పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా భూ సంస్కరణలు చేశారని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శాసనసభలో శుక్రవారం భూ సంస్కరణలు, ధరణిపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రపంచ చరిత్రలో నిలిచిన భూదాన ఉద్యమం తెంలగాణలోనే పుట్టిందని పేర్కొన్నా రు. 1973లో కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ చట్టం తెచ్చిందని, ఆ చ ట్టంతోనే పేదలకు భూములు పంచిందని తెలిపారు. వైఎస్ హ యాంలో పోడుభూములకు చట్టాలిచ్చారని గుర్తుచేశారు. భూ విప్లవాత్మక మార్పులు తెస్తామని అనేకమంది చెప్పారని, కానీ ఎక్కడ చూసినా భూసమస్యలే కనిపిస్తున్నాయన్నారు.

గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉందని, ధరణి తెచ్చిన సమస్యలకు పేద రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ధరణి పేరుతో అప్పటి పెద్దాయన ప్రజలను దగా చే శారని మండిపడ్డారు. ఆ పోర్టల్ వల్ల ప్రజలు చాలా సమస్యలు ఎ దుర్కొన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సర్వం నాకే తెలుసునని, ఎవరు చెప్పినా వినని ఓ పెద్దాయన, ఆయనకు తొత్తుగా ఉండే అధికారి గదిలో కూర్చొని తీసుకొచ్చిందే ధరణి పో ర్టల్ అని పేర్కొన్నారు. కోట్లాది మంది ఆస్తులకు గార్డియన్‌గా ఉం డాల్సిన పెద్దలు ప్రజలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డా రు.

పేదోళ్ల ఆస్తులను కొల్లగొట్టారని, మాయదారి పోర్టల్‌లో భూ ములు మాయం చేశారని ఆరోపించారు. ప్రతి ఊరిలో సామాన్యు లు భూ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. 2020 అక్టోబరులో ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉందని, అది శాపంగా మారిందని పేర్కొన్నారు. ధరణి భూ సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం గుండుసున్నా అయ్యిందని విమర్శించారు. అపర మేధావులు ఇద్దరు కూర్చొని చేయడంతోనే సమస్యలు తలెత్తాయన్నారు. తెలంగాణ రైతులు కష్టాలు అనుభవిస్తున్నారని, ధరణి చట్టం ద్వారా ఎంతో నష్టం వాటిల్లిందని తెలిపారు. సమాజ ప్రగతిని నిర్దేశించే వారు సలహాలు స్వీకరించలేదని, దాంతో శూన్య ప్రగతిని చేకూరిందని పేర్కొన్నారు.

డీఫాల్ట్ కంపెనీతో ఒప్పందం
ప్రతి గ్రామంలోనూ వేలాది అప్లికేషన్లు వస్తున్నాయని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆర్‌ఒఆర్ 2020 చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఐఎల్‌ఎఫ్‌ఎస్ అనే కంపెనీకి అప్పగించారని, ఆ తర్వాత టెర్రాసిస్ కంపెనీగా మారిందని చెప్పారు. అయితే అది దివాళా తీసిన విదేశీ కంపెనీకి 2.50 కోట్ల వివరాలను అప్పగించారన్నారు. డీఫాల్ట్ కంపెనీ అని తెలిసినా వారి తొత్తులకు భూములను అప్పగించడానికే ఇలా చేశారని ఆరోపించారు. రావణాసూరిడికి పది తలలు అని, ధరణిని మూడు తలలతో మొదలు పెట్టి 33 తలలకు పెంచారని విమర్శించారు. ఎవరికీ అర్ధం గాని భూతంగా ధరణి మారిందన్నారు. సామాన్యుల ఆస్తులను కనబడకుండా చేశారని, ఒక సర్వే నంబరులో కొంత భాగంపై వివాదం ఉంటే ఆ మొత్తం విస్తీర్ణాన్ని నిషేదిత జాబితాలో పెట్టడం ద్వారా లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని వివరించారు. మాయదారి పోర్టల్ ద్వారా మాయమైన ఆస్తులను తిరిగి పేదలకే ఇస్తామని మంత్రి ప్రకటించారు. పేదల ఆస్తులు దొరల పేరు మీదికి మారాయని మండిపడ్డారు.

చట్టంలో అనేక లోపాలు
ధరణి పోర్టల్‌లో అనేక లోపాలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సాదాబైనమాలకు అవకాశం కల్పిస్తామని అప్లికేషన్లు స్వీకరించారని, కానీ కొత్త చట్టంలో అవకాశం లేకుండా చేసిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని పేర్కొన్నారు. సమీక్షలో పది గంటలు కూర్చొంటే పెద్దాయనే మాట్లాడేవారని, తాము మాట్లాడడానికి అవకాశమే లేకుండా ఉండేదని వాపోయారు. గుండె మీద చేయ్యేసి చెప్పండి… మీరేమైనా మాట్లాడారా..? అని సభ్యులను అడిగారు. గ్రామ స్థాయిలో ఉద్యోగి లేకుండా విఆర్‌ఒ వ్యవస్థ లేకుండా చేశారని, అసలు గ్రామ స్థాయిలో ఓ ఉద్యోగి ఉండాల్సిన అవసరం లేదా..? అని ప్రశ్నించారు.

అందరి ఆమోదంతో కొత్త చట్టం
సామాన్యులకు సమస్యగా మారిన ధరణి పోర్టల్‌ని బంగాళాఖాతంలో కలిపేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలు చేపట్టిన పాదయాత్రలో భూ సమస్యలే వచ్చాయని వివరించారు. అందుకే తాము ధరణి సమస్యలపై అధ్యయనానికి కమిటీ వేశామని తెలిపారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం 10 గ్రామాల్లో స్టడీ పూర్తయ్యిందన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోనూ స్టడీ చేస్తున్నామని, మరో 15 రోజుల్లో రిపోర్ట్ వస్తుందని తెలిపారు.

అయితే ఇప్పటికే ధరణి పోర్టల్‌ని సవరించేందుకు, సమగ్ర భూ పరిపాలనకు కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. కొత్త చట్టం ముసాయిదాను శుక్రవారం నుంచే ప్రజల ముందు ఉంచుతున్నామని, మూడు వారాల పాటు అన్ని వర్గాల సలహాలను స్వీకరిస్తామని తెలిపారు. వేల పుస్తకాలు చదివిన పెద్దాయన, గడి నుంచి బయటికి రాని వారు సలహాలు ఇచ్చినా ప్రజామోదం ఉంటే స్వీకరిస్తామన్నారు. వచ్చే శాసనసభలో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే కొత్త చట్టం అమలులోకి తీసుకొస్తామని తెలిపారు.

సిసిఎల్‌ఎ వెబ్‌సైట్‌లో ముసాయిదా
ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్‌ఒఆర్ బిల్లు 2024పై ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే ముసాయిదా బిల్లును పబ్లిక్ డొమెయిన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు సిసిఎల్‌ఎ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సిసిఎల్‌ఎ వెబ్ సైట్ (www.ccla.telangana.gov.in)లో అందుబాటులో ఉంచారు.

ఈ నెల 23వ తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ఎవరైనా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలు కల్పించారు. ప్రజలు తమ సలహాలు సూచనలను ఈ మెయిల్ (ror2024-rev@telangana.gov.in) చేయాలి. పోస్ట్ ద్వారా ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్‌ఏ కార్యాలయం, నాంపల్లి, స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, ఆబిడ్స్, హైదరాబాద్ 500001 చిరునామాకు సిసిఎల్‌ఎ కార్యాలయానికి పంపించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News