Wednesday, December 25, 2024

45ఏళ్లుగా పార్టీలో ఉంటున్నా.. మీడియా ముందు కన్నీళ్లు పెట్టిన పొన్నాల

- Advertisement -
- Advertisement -

తన రాజీనామాపై టిపిసిసి మాజీ అధ్యక్షుడు, సమాచార సాంకేతిక శాఖ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య భావోద్వేగమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ కన్నీలు పెట్టుకున్నారు. తాను మూడుసార్లు వరుసగా గెలిచిన బిసి నాయకుడినని, పార్టీలో ఎన్నో అవమానాలు, అవహేళనలు గురయ్యనని బాధపడ్డారు. 45 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా తనకు గౌరవం లభించడం లేదని వాపోయారు. పార్టీ బాగు కోసం ఎన్ని చెప్పినా సరే వినే నాథుడే లేడని అన్నారు.

పార్టీలో బిసిలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. కొందరు నేతల వైఖరితో పార్టీ పరువు మట్టిలో కలుస్తోందన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను అమలు చేయడం లేదని, సీనియర్లకు కూడా అధిష్ఠానం అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చెప్పాలో మాటలు రావడం లేదన్నారు. ఈ నిర్ణయం తనకు బాధాకరమని, అయినా తప్పడంలేదని అన్నారు. తన రాజకీయ భవిష్యత్ పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.

కాగా, జనగాం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించిన కారణంగానే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పొన్నాల తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపారు.

Also Read: కెటిఆర్ వద్దకు ఇల్లందు పంచాయితీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News