Thursday, December 26, 2024

పొన్నాల x కొమ్మూరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మద్దూరు: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు రచ్చకెక్కింది. మాజీ ఎంఎల్‌ఎ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వాహనంపై మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రతాప్ రెడ్డి వాహ నం అద్దాలు ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రచ్చబండ కార్యక్రమానికి పిసిసి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిం దే. జనగామ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న పొన్నాల, ప్రతాప్ రెడ్డి ఎవరికి వారు తమకున్న పలుకుబడితో ముందుకుపోతున్నారు. అయితే ఇటీవల కాలంలో నియోజకవర్గంలో పోటీపోటీ కార్యక్రమాలు చేస్తు న్న నేపథ్యంలో ఇరువర్గాల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో కొన్ని రోజులుగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆదివారం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు దూల్మిట్ట మండలంలోని కూటిగల్ కూటిగల్‌కు తన వాహనంలో వెళ్తున్న ప్రతాప్ రెడ్డిని పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు అడ్డుకున్నారు. ఈ దశలో ఇరువర్గాల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పొన్నాల వర్గానికి చెందిన కార్యకర్తలు ప్రతాపరెడ్డి వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో ప్రతాప్ రెడ్డి, పొన్నాల వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పొన్నాల వర్గీయుల దాడిలో ప్రతాపరెడ్డి కారు ధ్వంసమైంది. ఈ ఘటనలో ప్రతాప్‌రెడ్డి రాళ్ల దాడి నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో గొడవ సద్దుమణిగింది.

ponnala Lakshmaiah vs Kommuri Pratap Reddy in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News