Monday, December 23, 2024

యుపి, ఢిల్లీ, బిహార్, ఒడిశాలో బిజెపి ఎందుకు గెలవలేదు: పొన్నాల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిందని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య తెలిపాడు. తన ఫేస్ బుక్ ఖాతా నుంచి పొన్నాల మాట్లాడారు. బిజెపి రాజస్థాన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో 26,852 ఓట్లతో ఓడిపోయిందన్నారు. ఛత్తీస్ ఘడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బిజెపి 21,171 ఓట్లతో ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. ఒడిశా ఉప ఎన్నికల్లో బిజెడి చేతిలో బిజెపి 42,679 ఓట్లతో ఓడిపోయిందన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఎంపిగా 2,88,461 ఓట్లు, ఒక ఎంఎల్ఎ 22,143 ఓట్లతో తేడాతో ఎస్ పి చేతిలో బిజెపి ఓటమిని చవి చూసిందని ధ్వజమెత్తారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ చేతిలో బిజెపి భంగపడింది. బీహార్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జెడియుపై కేవలం 3,600 తేడాతో బిజెపి గెలిచింది. కేవలం గుజరాత్ రాష్ట్రంలో గెలవడంతోనే దేశంలో బిజెపి గాలి ఉంది అని ప్రచారం చేయడం సరికాదని చురకలంటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News