Thursday, November 14, 2024

నమస్తే పెట్టినా రేవంత్ పట్టించుకోలేదు..

- Advertisement -
- Advertisement -

రెండు సంవత్సరాలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై పిసిసి అధ్యక్షుడితో మాట్లాడడానికి పలుసార్లు అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపించినా నమస్తే పెడితే కూడా స్పందించ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతం సామాజిక న్యాయానికి పాతర పడిందన్నారు. సమాజంలో 50 శాతంపైగా ఉన్న బిసిల పట్ల పార్టీలో అత్యంత అవమానకరంగా వ్యవహారిస్తున్నారని ఆయన ఆరోపించారు. జనాభా ప్రకారం సీట్లు కావాలని అడిగితే కనీసం చర్చించిన సందర్భాలు లేవని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.

2001లో తెలంగాణ రాష్ట్రం కోసం 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి పంపిన వారిలో మొదటి సంతకం తానే పెట్టినట్లు ఆయన గుర్తు చేశారు. జనగామ నియోజకవర్గంలో 7 రిజర్వాయర్లు నిర్మించానని, మంత్రిగా పని చేశానని, బిసి నాయకుడైన నన్ను అవమానిస్తుంటే పార్టీ చూస్తూ ఊరుకుందని, గతంలో ఓడిపోయాక ఎమ్మెల్సీ ఇస్తామన్నా తాను తీసుకోలేదని, కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నందుకు ఇన్నాళ్లూ గర్వపడుతున్నానని పొన్నాల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News