Monday, December 23, 2024

నిరసన సెగ

- Advertisement -
- Advertisement -

ఓటు హక్కు వినియోగంపై రభస జాబితా నుంచి
చెంచారపు పేరు తొలగింపుపై పొన్నాల ఆగ్రహం దేశ
వ్యాప్తంగా 96శాతం ఓటింగ్ ఓటెసిన సోనియా, రాహుల్

మన తెలంగాణ/హైదరాబాద్: ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాంధీ భవన్‌కు వచ్చిన పొన్నాల లక్ష్మయ్య.. అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున పిసిసి ప్రతినిధులకు ఓటు వే సేందుకు ఎఐసిసి ఓటర్ కార్డు జారీ ఈ క్రమంలోనే జనగామ నుంచి మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, చెంచారపు శ్రీనివాస్ రెడ్డిలకు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో ఇద్దరు నేతలు ఓటు వేసేందుకు గాంధీ భవన్‌కు చేరుకున్నారు. మరోవైపు జనగామ నుంచి తనకు ఓటు వేసే అవకాశం ఉందని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా గాంధీ భవన్‌కు చేరుకున్నారు. అయితే ఓటరు జాబితాలో అఖరి క్షణాల్లో శ్రీనివాస్ రెడ్డి పేరు తొలగించి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరు చేర్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ రెడ్డి ఓటు వేసేందుకు అనుమతించకపోవడంపై పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఓటు ఇవ్వడంపై పొన్నాల అభ్యంతరం వ్యక్తం చేశారు. 45 ఏళ్ల కాంగ్రెస్ మనిషికి అవమానం జరిగిందని పొన్నాల విమర్శించారు. పొన్నాలను కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఇతరులు సముదాయించారు. ఈ పరిణామంతో జనగామ నియోజకవర్గం కాంగ్రెస్‌లో గత కొంతకాలంగా చోటుచేసుకున్న వర్గ విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి.

అయితే ప్రస్తుతానికి ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దరినీ ఓటు వేయకుండా ఆపేశారు. ఈ విషయంపై ఎఐసిసి ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉంటే.137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది ఆరోసారి. ఇక, 24 ఏళ్ల తర్వాత గాంధీ కుబుంబేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు.

గాంధీభవన్ ముందు పొన్నాల, రాజనర్సింహ నిరసన

గాంధీభవన్ ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో డెలిగేట్ కార్డులు ఇచ్చిన వ్యక్తులకు ఓటేసే అవకాశం కల్పించలేదని ఆరోపించారు. తనతో పాటు జనగామకు చెందిన వ్యక్తికి డెలిగేట్ కార్డు ఇచ్చారని, అతడు ఓటేయడానికి వస్తే అవకాశమివ్వలేదని పొన్నాల ఆరోపించారు. కార్డు ఇచ్చి ఎందుకు ఓటేసే అవకాశం కల్పించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం నారాయణ ఖేడ్ కు చెందిన ఓ వ్యక్తికి పిసిసి డెలిగేట్ కార్డు ఇచ్చారని, ఇప్పుడా వ్యక్తి ఓటేసేందుకు వస్తే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని దామోదర్ రాజనర్సింహ మండిపడ్డారు. తన 55 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదని చెప్పారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల్ని అవమానించడమేనని దీనికి సమాధానం చెప్పాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News