- Advertisement -
హైదరాబాద్: ఇప్పటివరకు తెలంగాణతల్లికి అధికారిక రూపం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటివరకున్న తెలంగాణ తల్లి విగ్రహాలన్నీ.. ఒక పార్టీకే అనుసంధానమైనవేనని చెప్పారు. పదేళ్ల నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించలేదని.. తమ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్ర సెంటిమెంట్‌కు అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
- Advertisement -