- Advertisement -
హైదరాబాద్: రాజకీయాల కోసం అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకోమని మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ పై మండిపడ్డారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇస్తే తీసుకుంటామని తెలిపారు. 14 నెలల తర్వాత కెసిఆర్ బయటకి వచ్చారని మంత్రి పొన్నం అన్నారు. బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం కేంద్రంతో కొట్లాడి బండి నిధులు తేవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు.
- Advertisement -