- Advertisement -
హైదరాబాద్: బిజెపి, బిఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పోటీలో ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలపై పొన్నం స్పందించారు. బిజెపి, బిఆర్ ఎస్ ఒప్పందంలో భాగంగానే బిజెపి నామినేషన్ జరిగిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము తటస్థమని ఏ పార్టీకి మద్దతు తెలపమని చెప్పారు. తమకు బలం లేకపోవడం వల్లే బరిలో నిలవలేదని పొన్నం తెలియజేశారు. బలం లేని చోట బిజెపి ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లోనూ బిజెపికి బిఆర్ఎస్ సహకరించిందని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిఆర్ఎస్ నేతకు బినామీగా వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్నం విమర్శించారు.
- Advertisement -