Sunday, January 19, 2025

టచ్ చేసి చూడండి… ఏం జరుగుతుందో తెలుస్తుంది: పొన్నం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడండి, ఏం జరుగుతుందో చూస్తారంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విపక్ష పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు. బిజెపి గేట్లు తెరిస్తే కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలుతోందన్న బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల కు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమని, దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వాన్ని కులగొడతామంటున్నారు, మీరు ఏమైనా జ్యోతిష్యం చెప్పారా..? అని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. మూర్ఖులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. బిజెపి బలహీన వర్గాల వ్యక్తిని అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్‌రెడ్డికి ఇచ్చారని గుర్తు చేశారు.

బిసిలకు అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వలేదు?

టిఆర్‌ఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి నిన్నటివరకు బలహీన వర్గాల వ్యక్తికి అధ్యక్ష పదవిని ఎందుకు ఇవ్వలేదని ఆయన కెటిఆర్‌ను ప్రశ్నించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అయినా సరే అధ్యక్ష పదవి వేరే వ్యక్తికి ఇవ్వవచ్చు కదా, ముఖ్యమైన పదవులు అన్నింటిలోనూ మీరే ఉండి, ఇంకా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ పాలనలో బిసిలకు ఏం చేశారో చెప్పాలంటూ కెటిఆర్‌ను ఆయన నిలదీశారు. బిఆర్‌ఎస్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఏం న్యాయం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 16 కులాలకు కార్పొరేషన్లు కేటాయించామన్నారు. కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే అడిగే స్వేచ్ఛ తమకుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News