హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులను తాము ప్రోత్సహించలేదని ఇందులో డాక్టరేట్ బిఆర్‌ఎస్‌కే దక్కుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చురకలంటించారు. గాంధీ భవన్ నుంచి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను తీసుకొని మంత్రి పదవులు ఇచ్చింది మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కాదా? అని ప్రశ్నించారు. బిజెపి-బిఆర్‌ఎస్ కలిసి తమ ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉన్నవారిపై తాము ఎప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిఆర్‌ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, కెసిఆర్ కూడా ప్రాంతీయతత్వం రెచ్చగొట్టారని, బిర్యానీ మాది, పెండ మీది అని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అనలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రోళ్లపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మాట్లాడిన వీడియోను కెటిఆర్‌కు పంపుతానన్నారు. ప్రజాప్రతినిదుల ఇళ్లపై దాడులు, భౌతిక దాడులు మంచిది కాదని హితువు పలికారు. హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్ర ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదేళ్లు అధికారంలో ఉన్నవారు… పది నెలలు కూడా ఓపిక పట్టకపోతే అహనం అంటారని పొన్నం ధ్వజమెత్తారు.
ఆ విషయంలో డాక్టరేట్ బిఆర్‌ఎస్‌కే దక్కుతుంది: పొన్నం
- Advertisement -
- Advertisement -
- Advertisement -