Friday, December 20, 2024

బస్సులలో మహిళలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు: పొన్నం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రతి కుటుంబానికి అందేలా చూస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్, సిపిఐ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. రేపటి నుంచి జరిగే ప్రజాపాలన విజయవంతం చేయాలని పొన్నం పిలుపునిచ్చారు. బస్సులలో మహిళలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, తెలంగాణ అప్పుల పాలైందని, కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగాయని చురకలంటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు జీతాలు అందే విధంగా చర్యలు చేపడుతామని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News