Wednesday, January 22, 2025

భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు వచ్చిన ఇబ్బందేమీ లేదు: పొన్నం ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు వచ్చిన ఇబ్బందేమీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనసభలో సివిల్ కోర్టుల సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. సివిల్ కోర్టుల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కెటిఆర్‌కు పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారని, మహిళా మంత్రిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఫేక్ వీడియోలు పెడుతున్నారని, సభా కార్యక్రమాలపై ఫేక్ వీడియోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని పొన్నం హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News