హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పకడ్బందీగా సర్వే చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొంత మంది సమాచారం ఇవ్వకపోవడంతోనే రీ సర్వే చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28 వరకు మరోసారి సర్వే చేయిస్తున్నామని స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనని బిఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. బిజెపి వ్యాపారుల పార్టీ అని, వారికి రిజర్వేషన్లు ఇష్టం లేదు అని చురకలంటించారు. రిజర్వేషన్ల విషయంలో వ్యతిరేకమని కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన పార్టీ బిజెపి కాదా? అని ప్రవ్నించారు. భారత దేశం మొత్తం బిసి రిజర్వేషన్ అమలు చేసే విధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కృషి చేయాలని డిమాండ్ చేశారు. సర్వే తర్వాతనే స్థానిక ఎన్నికలు జరుగుతాయని పొన్నం స్పష్టం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు సమగ్ర కుటుంబ సర్వే మార్గదర్శకంగా నిలిచిందని కొనియాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ అమలు చేస్తున్నామన్నారు.
మిస్ అయిన వారి కోసం మాత్రమే రీసర్వే: పొన్నం
- Advertisement -
- Advertisement -
- Advertisement -