Saturday, March 15, 2025

బిఆర్‌ఎస్‌కు అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా:మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శాసనమండలి చైర్మన్‌పై కాగితాలు పడేశారని తమ పార్టీకి చెందిన సభ్యులను సస్పెండ్ చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని బిఆర్‌ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం వేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్ట సభల్లో ప్రజాస్వామ్యానికి నాయకుడు ముఖ్యమంత్రి అయితే, సభకు అధిపతి స్పీకర్ అని ఆయన పేర్కొన్నారు. అలాంటి అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్‌ను ‘సభ మీ ఒక్కడిదే కాదు’ అని ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కామెంట్ చేయడం సభా హక్కును ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడింది తప్పని బిఆర్‌ఎస్ అధినాయకత్వం చెప్పకపోవడం

దురదృష్టకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన వాళ్లే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికం అంటూ అసెంబ్లీ అవరణలో నిరసనకు దిగడం హస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే విషయంలో బిఆర్‌ఎస్ పార్టీకి కనీస జ్ఞానం రావాలని ఆయన సూచించారు. సభలో ఎలా ఉండాలో సభా వేదికపై ఎలా ప్రవర్తించాలో తెలిసి కూడా అలా చేస్తున్నారంటే వారిలో ఏదో దుర్భుద్ధి ఉందన్నది స్పష్టంగా అర్ధ మవుతోందన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఉభయ సభలకు కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయని మంత్రి పొన్నం తెలిపారు. స్పీకర్ ఓ దళిత బిడ్డ కాబట్టే ఆయనపై ఇష్టానుసారంగా బిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News