Thursday, March 6, 2025

రాష్ట్రాభివృద్ధికి కిషన్ రెడ్డి సహకరించట్లేదు: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంబర్‌పేటలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. నియోజకవర్గంలో బాగ్ అంబర్‌పేట, నల్లకుంట, బర్కత్‌పురా ప్రాంతాల్లో రూ.4.90 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, అంబర్ పేట కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి రోహిన్ రెడ్డి పలువురు నేతలు, అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడారు…బిఆర్ఎస్ పాలనలో రాష్టంలో ఆర్థిక విధ్వసం జరిగిందని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహకరించట్లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు కిషన్ రెడ్డి అడ్డొస్తున్నారని పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News