Thursday, December 26, 2024

మహిళలకు ఫ్రీ జర్నీ వద్దా?… బిఆర్ఎస్ నేతలే చెప్పాలి: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పదేళ్లలో ఆర్‌టిసి కార్మికులు, సిబ్బందిని బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆగం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలన్న తప్పక నెరవేరుస్తామని, ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగదని పొన్నం స్పష్టం చేశారు. ఆటో కార్మికులు తెలంగాణ బిడ్డలు కాదా?.. ఆటో డ్రైవర్లను బిఆర్‌ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. మహిళలకు ఫ్రీ జర్నీ వద్దా అనేది బిఆర్‌ఎస్ నేతలే చెప్పాలని పొన్నం చురకలంటించారు. 21 మంది ఆటో కార్మికులు ఎక్కడ చనిపోయారని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News