Monday, December 23, 2024

గాంధీ భవన్ వద్ద పొన్నం ప్రభాకర్ అనుచరుల ఆందోళన..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో చోటు దక్కకపోవడంతో పొన్నం ప్రభాకర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తున్న తనపై అధిష్టానం చిన్నచూపు చూస్తుందని సన్నిహితులు, కార్యకర్తల వద్ద పొన్నం ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలో పొన్నంకు ప్రాధాన్యత లభించడం లేదని, ఏ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కలేదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం గాంధీ భవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుండగా పొన్నంకు అనుకూలంగా పొన్నం అనుచరులు నినాదాలు చేస్తూ ఆందోళన దిగారు. దీంతో గాంధీ భవన్ వద్ద ఉదృిక్తత పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News