Sunday, November 24, 2024

గల్ఫ్ బాధితుల కోసం ‘ప్రవాసి ప్రజావాణి’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజాభవన్ లో వారానికి రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రోగ్రాం ద్వారా గల్ఫ్ బాధితుల కోసం ‘ప్రవాసి ప్రజావాణి’ పేరిట ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం కూడా ప్రజావాణి తరహాలోనే వారానికి రెండు రోజులు అంటే బుధ, శుక్ర వారాల్లో నిర్వహించనున్నారు.

నేడు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేశ్ గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నా రెడ్డి ప్రారంభించారు. గల్ఫ్ కార్మికులు, ఎన్నారై సమస్యల పరిష్కరానికి ‘ప్రవాసీ ప్రజావాణి’ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో దీని కౌంటర్ తెరచి ఉంటుంది.

నేడు పొన్నం ప్రభాకర్ ఉదయం 10.00 గంటలకు ‘ప్రవాసీ  ప్రజావాణి’ కౌంటర్ ను పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ విషయాన్ని టిపిసిసి ఎన్నారై విభాగం చైర్మన్ వినోద్ కుమార్ వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News