Saturday, November 9, 2024

కౌశిక్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రామగుండం లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో రూ. 100 కోట్ల ఫ్లయ్ యాష్ కుంభకోణం చేశానని తనపై ఆరోపణ చేసినందుకు  తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  హుజురాబాద్ బిఆర్ఎస్ ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి సహా టి న్యూస్ ఎండీ సంతోష్  కుమార్, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుల్ల కృష్ణమూర్తి, తెలంగాణ పబ్లికేషన్ ప్రయివేట్ లిమిటెడ్, తెలంగాణ బ్రాడకాస్టింగ్ ప్రయివేట్ లిమిటెడ్ లకు పరువునష్టం నోటీసులు పంపారు.

రామగుండం ఎన్ టిపిసి నుంచి అక్రమంగా ఫ్లయ్ యాష్ ను రవాణా చేస్తున్నందుకు రోజువారీగా రూ. 50 లక్షల ముడుపులు పొన్నం ప్రభాకర్ కు అందుతున్నాయని హుజురాబాద్ ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అంతేకాక ప్రభాకర్ మేనల్లుడు అనూప్ ఆ డబ్బును పొందుతున్నాడని కూడా ఆయన ఆరోపించారు.

ఫ్లయ్ యాష్ అనేది ‘బూడిద’. పవర్ స్టేషన్లలో బొగ్గును మండించగా వచ్చేది. దానిని కాంక్రీట్, డ్యామ్స్, ఫ్లోయేబుల్ ఫిల్లింగ్స్, గనులు, గుంతలు పూడ్చడానికి ఉపయోగిస్తుంటారు.

రామగుండంలోని ఎన్ టిపిసి 2600 మెగావాట్లు ఉత్పత్తి చేసే సూపర్ థర్మల్ స్టేషన్. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద థర్మల్ కేంద్రం. దేశంలోని సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లలో తొలి ఐఎస్ఓ 14001 సర్టిఫికేట్ పొందిన కేంద్రం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News