Monday, December 23, 2024

ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తాం: పొన్నం

- Advertisement -
- Advertisement -

వరంగల్: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా హనుమకొండలో జరిగిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో పొన్నం మాట్లాడారు. ఎన్నికల హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని, ఉద్యమకారులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తామని, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఈ ఏడాది కాకతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోడీ కించపర్చారని, తెలంగాణను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఈ సమ్మేళనంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కోదండరామ్, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News